Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల మధ్యకు కాంగ్రెస్ ప్రభుత్వం

అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల మధ్యకు కాంగ్రెస్ ప్రభుత్వం

- Advertisement -

ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య  
నవతెలంగాణ – ఆలేరు టౌను

అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో ప్రజల మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆలేరు పట్టణంలో సోమవారం వ్యవసాయ మార్కెట్లో, ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు, బొమ్మలరామారం, ఆత్మకూరు, మోటకొండూరు, గుండాల, యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి మండలాలకు చెందిన రైతులకు సబ్సిడీ లో వ్యవసాయ పనిముట్లు రూ.55 లక్షల 84 వేల విలువైన పైచిలుకు యంత్ర పరికరాలను వ్యవసాయ అధికారులతో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సబ్సిడీలో ఇచ్చిన యంత్ర పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులను సొంత వ్యవసాయ క్షేత్రాలకు, చిన్న సన్న కార్ రైతులకు మిషనరీస్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రజా పాలనలో రైతులను, మహిళలను, సబ్బండ వర్గాలందర్నీ  స్వయంగా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు  నిలబడేటట్టు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.

కూలీల సమస్యల పరిష్కారానికి, చిన్న సన్న కారు రైతులకు యంత్ర పరికరాలు సేద్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి  పథకాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మా వెంకటస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, జిల్లా, మండల, వ్యవసాయ అధికారులు ,రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -