Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తిరుమలనాథుని కళ్యాణానికి భారీ విరాళం

తిరుమలనాథుని కళ్యాణానికి భారీ విరాళం

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం కుంకుడు చెట్టు తండా గ్రామపంచాయతీ బోనూతుల గ్రామం కోనేరటీపురంలో వెలిసినటువంటి శ్రీశ్రీశ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థానం కళ్యాణ మహోత్సవం ఫిబ్రవరి ఒకటో తారీఖున జరుగుచున్నది. అట్టి కల్యాణ మహోత్సవానికి చలకుర్తి గ్రామానికి చెందిన మహోన్నత వ్యక్తి గగ్గినపల్లి సాంభారెడ్డి- ఈశ్వరమ్మ దంపతులు కళ్యాణ మహోత్సవ వేడుకలకు  లైటింగ్,డెకరేషన్,మరియు దేవుని కళ్యాణ మహోత్సవానికి  రూ.1,00,116 రూపాయలు  శ్రీశ్రీశ్రీ తిరుమల నాథస్వామి ఆలయ ఛైర్మెన్ కల్లూరి వెంకటేశ్వర్ రెడ్డి,వైస్ ఛైర్మెన్ దండు బిక్షం,మాజీ ఉపసర్పంచి పాకాల యల్లయ్య మరియి కమిటీ సభ్యులకు సోమవారం అందజేశారు. ఈసందర్బంగా ఆలయం కమిటీ ఛైర్మెన్,వైస్ ఛైర్మెన్  కమిటీ సభ్యులు విరాళం అంద జేసిన గగ్గినపల్లి సాంభా రెడ్డిని ఘనంగా సన్మానం చేసి అభినందనలు ధన్యవాదాలు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -