Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జనగామలో ఘనంగా వివేకానంద జయంతి

జనగామలో ఘనంగా వివేకానంద జయంతి

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి, బీబీపేట్ 
జనగామ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం జనగామ గ్రామంలోని గ్రామ గ్రంథాలయం వద్ద స్వామి వివేకానంద 163 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు మెంబర్ నరసింహా చారి హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని, సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి ప్రతినిధులు దీపక్, ప్రదీప్, శేఖర్, రఘు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులు, యువకులు తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -