నవతెలంగాణ – కామారెడ్డి
స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ వద్ద గల వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం న్యాయవాది పరిషత్ నూతన సంవత్సర క్యాలెండర్ను న్యాయవాది పరిషత్ అధ్యక్షులు బి. దామోదర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వివేకానంద బోధనలు యువతకు మార్గదర్శకమని, ఆయన చూపిన ఆదర్శ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ శర్మ, బార్ అసోసియేషన్ కార్యదర్శి సురేందర్ రెడ్డి, సీనియర్ న్యాయవాది అమృతరావు, న్యాయవాది పరిషత్ సభ్యులు, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.
న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



