Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం 

చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం 

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
వివేకానంద స్వామి జయంతి పురస్కరించుకొని నిహారిక పిల్లల ఆస్పత్రి ఆధ్వర్యంలో మండలంలోని సీతాయిపేట గ్రామ సర్పంచ్ సిహెచ్ భూమేష్ ఆధ్వర్యంలో గ్రామములోని చిన్న పిల్లలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నిహారిక ఆస్పత్రి నవజాత శిశువు మరియు చిన్న పిల్లల వైద్య నిపుణులు డా, నిహారిక పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమములో ఉపసర్పంచ్ జంగిటి చంద్రశేఖర్, వార్డు సభ్యులు నగేష్, సరిత, గోపి, లహరి, మాజీ ఉపసర్పంచ్ ఎంపిటిసి సభవత్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ లోక్కిడి విజయ రాములు తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -