Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మానవత్వం చాటుకున్న గ్రామస్తులు

మానవత్వం చాటుకున్న గ్రామస్తులు

- Advertisement -

– అనాధ కుటుంబానికి ఆర్థిక సహాయంతో బాసట
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
అనాధ కుటుంబానికి ఆసరా కల్పించేందుకు తోచినంత సహాయం చేసి కమ్మర్ పల్లి యువత, గ్రామస్తులు మానవత్వం చాటుకున్నారు. మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన గజ్జెల లత గత  కొద్దిరోజులుగా అనారోగ్యంతో మంచం పట్టింది. దీంతో లత తో పాటు కూతురు అనాధలుగా మారారు.స్థానిక సోషల్ మీడియా గ్రూపులో వీరి పరిస్థితి తెలుసుకున్న గ్రామానికి చెందిన యువకులు తోచినంత ఆర్థిక చేయూతనందించేందుకు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం అనాధ కుటుంబానికి పలువురు యువకులు, దాతలు అందించిన రూ.15వేల 130 నగదు ఆర్థిక సహాయం అందజేశారు.

అదేవిధంగా వారి కుటుంబం గడిచేందుకు అవసరమైన నిత్యావసర సరుకులు బియ్యం, నూనె, పప్పులతో పాటు లత కూతురుకు 2 జతల డ్రెస్సులు వారి ఇంటి వద్దకే వెళ్లి అందించారు. ఆర్థిక సహాయంతో పాటు నిత్యవసర సరుకులు అందించి తమ కుటుంబానికి బాసటగా నిలిచిన యువకులకు, గ్రామస్తులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమoలో నల్లగణేష్ గుప్తా, జొన్నల భూషణ్, వేములవాడ జగధీశ్వర్, దూలూర్ కిషన్ గౌడ్, రాజేందర్, మాల్యాల సుభాష్ గౌడ్, స్టాలిన్,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -