నవతెలంగాణ – భీంగల్
ఈరోజు భీంగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి మాట్లాడుతూ.. కళ్యాణ లక్ష్మి చెక్కులు మండల రెవెన్యూ అధికారి కార్యాలయం ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయాలి. ప్రశాంత్ రెడ్డి అహంకారాన్ని ప్రదర్శించవద్దని, లబ్ధిదారులను ఇబ్బంది పెట్టవద్దని, ప్రజా పాలనలో అహంకారానికి చోటు లేదన్నారు. ప్రశాంత్ రెడ్డికి ప్రజా ప్రభుత్వం ప్రోటోకాల్ గౌరవాన్ని ఇచ్చింది. ఆ గౌరవాన్ని ఎమ్మెల్యే కాపాడుకుంటే మంచిదని, ప్రజా ప్రభుత్వంలో ప్రజలను రాజకీయ నాయకుల ఇంటి చుట్టూ తింపుకునే కుసంస్కారం ఛిద్రం అయిందాన్నారు. కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను నేరుగా మండల తహసీల్దార్ కె సమర్పించే వెసులుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది.
గత ప్రభుత్వంలో సంవత్సరం దాటిన చెక్కులు మంజూరు కాలేదు కానీ ఈ ప్రభుత్వంలో దరఖాస్తు చేసిన నెల రోజుల్లో చెక్కులు మంజూరు అవుతున్నాయని అన్నారు. గతంలో కల్యాణలక్ష్మి దరఖాస్తు చేసుకోవాలంటే ఎమ్మెల్యే ఇంటి ముందు లైన్ లో, ఎండ అనక, వాన అనక నిలబడి అవమానాలు పడి తిరగాల్సి వచ్చేది. ఒకసారి పంచాక మిగిలిపోయిన లబ్ధిదారులవి చెక్కులు ఇవ్వద్దు వారందరూ నా ఇంటికే వచ్చి చెక్కులు తీసుకోవాలి అనే అహంకారం ప్రదర్శించొద్దు. మీకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటే మంచిది లేదంటే సంక్రాంతి పండుగ తర్వాత కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులతో మీ ఇంటిని ముట్టడి చేసే కార్యక్రమాన్ని చేపడుతమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అరిగేలా జనార్ధన్,మనుష అశోక్,సమీర్,దుమల మమత రాజు,ఉప సర్పంచ్ జేమ్స్, నల్లూరి శ్రీను,వాక మహేష్,సాయిబాబా,గడల లక్ష్మణ్,చిన్న రెడ్డి,కిరణ్,సాగర్,కుమార్,కలీం తదితరులు పాల్గొన్నారు.



