Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కల్లెడిలో పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ 

కల్లెడిలో పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలం కల్లెడి గ్రామంలో సర్పంచ్ గంగోల్ల సుస్మిత ప్రళయ్ తేజ్ ఆధ్వర్యంలో సోమవారం పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో తాగునీటి సరఫరా పరిస్థితి, డ్రైన్ల శుభ్రత పనులను సర్పంచ్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంగోల్ల సుస్మిత ప్రళయ్ తేజ్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ తాగునీటి పైపులైన్లు, మోటార్లు, ట్యాంకుల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చోట్ల మరమ్మత్తులు చేపడుతున్నామని చెప్పారు. అలాగే డ్రైన్లను క్రమం తప్పకుండా శుభ్రపరచడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌తో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -