నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలో సోమవారం మహిళా సంఘాల ఆధ్వర్యంలో నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులను ఘనంగా సన్మానించారు. స్థానిక మహిళా సంఘ భవనంలో సర్పంచ్ నలిమేల రేవతి గంగారెడ్డి, ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్, వార్డు సభ్యులు కుందేటి శ్రీనివాస్, పెద్ది సృజన్, జమున, గంగుబాయి, కల్లెడ రాణి, అశోక్, గంగాధర్, కాశవ్వ, కుందేటి పుష్ప, సోమ నవీన్, నరసయ్య లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. నూతన పంచాయతీ పాలకవర్గం సభ్యులకు మహిళ సంఘాల సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నలిమేల రేవతి గంగారెడ్డి మాట్లాడుతూ గ్రామ మహిళ సంఘాల అభ్యున్నతికి పంచాయతీ పాలకవర్గం సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. మహిళా సంఘాల సభ్యులు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్ గౌడ్, ఐకేపి సిసి అలేఖ్య, గ్రామ సమైక్యల అధ్యక్షులు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



