ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను అణచివేశారని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవడం లేదని తప్పుపట్టారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుని, ఆర్టీసీ కార్మికులను బెదిరించి, అధిక వడ్డీలకు అప్పులు చేసి, ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొదటి తారీఖున జీతాలు ఇవ్వకుండా, వరి వేస్తే ఉరి అంటూ కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన చేశారని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ప్రజల కోసం కాకుండా తన కుటుంబం కకలావికలం అవుతుందనే కేసీఆర్ బయటికి వచ్చారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీలు కలిసి కాంగ్రెస్‌పై పోటీ చేయాలని అనుకుంటున్నాయనీ, అందుకే కాళేశ్వరంపైన సీబీఐ విచారణ చేయడం లేదని విమర్శించారు.
అన్ని వర్గాల ప్రజల్ని అణచివేసిన కేసీఆర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



