Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిబీపేట వాసవి క్లబ్‌కు “బెస్ట్ మోటివేటర్ అవార్డు”

బిబీపేట వాసవి క్లబ్‌కు “బెస్ట్ మోటివేటర్ అవార్డు”

- Advertisement -

 నవతెలంగాణ –  కామారెడ్డి/బీబీపేట్
 బిబీపేట వాసవి క్లబ్‌కు “బెస్ట్ మోటివేటర్ అవార్డు” లభించింది. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్స్‌లో జరిగిన కామారెడ్డి రక్తదాతల సమూహ 19వ వార్షిక సమావేశంలో, వాసవి క్లబ్ బిబీపేట ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు గాను ఈ అవార్డును ప్రదానం చేశారు. రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి నీల బాలచంద్రం , ఐ వి ఎఫ్  రాష్ట్రీయ అధ్యక్షుడు, మాజీ వైశ్య కార్పొరేషన్ చైర్మన్  ఉప్పల శ్రీనివాస్ చేతుల మీదుగా వాసవి క్లబ్ బిబీపేట అధ్యక్షులు మురికి శ్రీనివాస్, కార్యదర్శి రెడ్డిశెట్టి శ్రీనివాస్‌కు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, రక్తదానం మహాదానం అని, వాసవి క్లబ్ సేవాభావం ఆదర్శనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ తోడుపునూరి నాగభూషణం, మాజీ రీజన్ చైర్మన్ తాటిపల్లి రమేష్, అర్వపల్లి రమేష్, బాశెట్టి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -