- Advertisement -
నవతెలంగాణ – కట్టాం గూర్: స్వామి వివేకానంద 163 వ జయంతి వేడుకలను మండలంలోని మునుకుంట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుల్లి నరేష్ పాల్గొని మాట్లాడారు. వివేకానంద బోధనలను యువత ఆదర్శంగా తీసుకొని సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షులు నూక, బత్తిని కృష్ణంరాజు, ఉపాధ్యక్షులు ములుగు బిక్షపతి శంకర్, రాంబాబు, ప్రశాంత్, పరమేష్, శ్రీను ఉన్నారు.
- Advertisement -



