నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద ఎడ్గి గ్రామంలో ఐక్యత యూత్ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని 163వ స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. గ్రామ సర్పంచ్ అనిల్ ఆస్పత్వర్ ముఖ్యఅతిథిగా పాల్గొని స్వామి వివేకానంద ఫోటోని పూలమాలలతో సత్కరించారు. సర్పంచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ వివేకానందుని ఆదర్శంగా తీసుకొని అతనికి యువత పట్ల ఉన్న అవగాహనను స్వామి వివేకానంద అవనిత్యాన్ని తెలియజేయడం జరిగింది. యువత సన్మార్గంలో నడుచుకోవాలని అన్నారు. చెడు స్నేహితులను, అలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు . కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఫయ్యూం ఖాన్ ఐక్యత యూత్ రవీందర్ శంషుద్దీన్, సందీప్ పండరి వినోద్ పవన్ రాజశేఖర్ శ్రీనివాస్ బాలు భజరంగ్ జ్ఞానేశ్వర్ గ్రామ యువకులు పెద్దలు తదితరు పాల్గొన్నారు.
పెద్ద ఎడ్గి ఐక్యత యూత్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



