Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్వామి వివేకానంద 163 వ జయంతి ఉత్సవాలు

స్వామి వివేకానంద 163 వ జయంతి ఉత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ – సదాశివనగర్
సదాశివ్‌నగర్ మండలం లింగంపల్లి గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని గ్రామస్తులు ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో స్వామి వివేకానంద జీవితం, ఆయన ఎదుర్కొన్న కష్టాలు, రామకృష్ణ పరమహంసతో ఉన్న గురుశిష్య బంధం, దేశవ్యాప్తంగా చేసిన పర్యటనలు, పేదల జీవితాల పట్ల ఆయన కలిగిన తపన గురించి వివరించారు. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభలో “Sisters and Brothers of America” అంటూ చేసిన ప్రసంగం ద్వారా ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసి, భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని అంతర్జాతీయ వేదికపై నిలిపిన ఘనతను వక్తలు గుర్తు చేశారు. కేవలం 39 ఏళ్ల జీవితకాలంలోనే భారత యువతకు చిరస్మరణీయమైన ప్రేరణగా నిలిచిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎడ్ల గంగారం, మాజీ ఉప సర్పంచ్ దామోదర్, అమృత రాజేందర్, పెద్దబీర సురేష్, భాస్కర్ రావు, కృష్ణ మూర్తి, పిబి వినయ్ , చిన్న బీర రాజు, చిన్న బీర రవి, గోపాల్ రావు, సంతోష్, శివ గౌడ్, వడ్ల సురేష్, రవి తేజ పంచాయతీ కార్యదర్శి ప్రకాష్, కారొబర్ రాజు గ్రామ యువత,  ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -