Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిట్యాల డబల్ బెడ్ రూమ్ కాలనీలో ముగ్గుల పోటీలు

చిట్యాల డబల్ బెడ్ రూమ్ కాలనీలో ముగ్గుల పోటీలు

- Advertisement -

 నవతెలంగాణ – వనపర్తి  
చిట్యాల రోడ్డు డబల్ బెడ్ రూమ్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం డబల్ బెడ్ రూమ్ ల దగ్గర మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలో 39 మంది మహిళలు పోటీలో పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు ముగ్గుల పోటీలో పాల్గొన్న వాళ్లందరికీ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఈ డబల్ బెడ్ రూమ్ కాలనీలో కులమత బేధాలు లేకుండా అందరూ కలిసి సామూహికంగా ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం హర్షించదగ్గ విషయమని వారు అన్నారు. రాబోయే కాలంలో అందరూ కలిసికట్టుగా ఉండి కాలనీ అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. ముగ్గుల పోటీలో మొదటి బహుమతి కృప, రెండవ బహుమతి తులసి, మూడవ బహుమతి శ్రీలక్ష్మి లకు బి కృష్ణ రమాదేవిల చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డబల్ బెడ్ రూమ్ కాలనీ అసోసియేషన్ చైర్మన్ సర్దార్ ఖాన్ అసోసియేషన్ సభ్యులు మండ్ల రాజు, జమీరుద్దీన్, మాజీ కౌన్సిలర్లు లక్ష్మీదేవమ్మ, జమ్ములమ్మ,  గోపాలకృష్ణ, శంకర్, సాయిలీల, చందు విష్ణు ఉమా పాల్గొనగా జడ్జీలుగా ఏ లక్ష్మి, బుచ్చమ్మ, ఏ కృష్ణయ్య వ్యవహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -