Friday, May 23, 2025
Homeఆటలుక్వార్టర్స్‌కు శ్రీకాంత్‌

క్వార్టర్స్‌కు శ్రీకాంత్‌

- Advertisement -

మలేషియా మాస్టర్స్‌ ఓపెన్‌
కౌలాలంపూర్‌: పురుషుల సింగిల్స్‌ మాజీ వరల్డ్‌ నం.1 కిదాంబి శ్రీకాంత్‌ ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. మలేషియా మాస్టర్స్‌ ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌లో అర్హత రౌండ్‌ నుంచి మెరుపు విజయాలు సాధించిన కిదాంబి శ్రీకాంత్‌.. ప్రధాన టోర్నమెంట్‌లోనూ అదే సత్తా చాటుతున్నాడు. మెయిన్‌ డ్రాలో వరుసగా రెండో విజయం సాధించిన కిదాంబి శ్రీకాంత్‌ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. కిదాంబి శ్రీకాంత్‌ 23-21, 21-17తో వరుస గేముల్లో నట్‌ ఎంగ్యుయెన్‌ (ఐర్లాండ్‌)ను మట్టికరిపించాడు. శ్రీకాంత్‌ మెరిసినా.. మెన్స్‌ సింగిల్స్‌లో ఇతర షట్లర్లు మాత్రం ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. హెచ్‌ఎస్‌ ప్రణరు, ఆయుష్‌, సతీష్‌ కుమార్‌ కరుణాకరన్‌ నిరాశపరిచారు. తొలి రౌండ్లో సంచలన విజయాలు సాధించిన ప్రణరు, ఆయుశ్‌ ప్రీ క్వార్టర్స్‌లో అంచనాలను అందుకోలేదు. జపాన్‌ షట్లర్‌ యుషి తనక చేతిలో 9-21, 18-21తో ప్రణరు ఓటమి చెందాడు. ఫ్రాన్స్‌ షట్లర్‌ టోమ చేతిలో 13-21, 17-21తో ఆయుశ్‌ శెట్టి పరాజయం పాలయ్యాడు. ఫ్రాన్స్‌కే చెందిన మరో షట్లర్‌ చేతిలో సతీశ్‌ కరుణాకరన్‌ 9-21, 14-21తో భంగపాటుకు గురయ్యాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తనీషా క్రాస్టో-ధవ్‌ కపిల 21-17, 18-21, 21-15తో లియ పలెర్మొ-జులియన్‌ (ఫ్రాన్స్‌)ను చిత్తు చేసి క్వార్టర్స్‌కు అర్హత సాధించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -