అండర్-19 జట్టుకు
ఎంపికైన యువ స్టార్స్
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడిన తొలి సీజన్‌లో అంచనాలకు మించి రాణించిన యువ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రెలకు ఆల్ ఇండియా బీసీసీఐ సెలక్షన్ కమిటీ అదిరే అవకాశం అందించింది. భారత సీనియర్ మెన్స్, సీనియర్స్ ఉమెన్స్, భారత్-ఏ మెన్స్ జట్టుతో పాటు టీమ్ ఇండియా అండర్-19 మెన్స్ టీమ్ సైతం ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత అండర్-19 జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ జట్టులో ఐపీఎల్ స్టార్స్ వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రెలకు చోటు దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో అతడి స్థానంలో వచ్చిన ఆయుష్.. తనదైన ఆటతీరుతో ఆ జట్టు భావి ఓపెనర్‌గా ప్రశంసలందుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో 14 ఏండ్లకే అరంగేట్రం చేయడంతో పాటు గుజరాత్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లోనే శతకం బాదిన వైభవ్‌నూ సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్ అండర్-19, భారత్ అండర్-19 జట్ల పోరు జూన్ 24 నుంచి ఆరంభం కానుండగా.. ఆయుశ్ మాత్రె కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
భారత అండర్-19 జట్టు : ఆయుశ్ మాత్రె (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజసిన్హ, రాహుల్ కుమార్, అభిగ్యాన్ (వైస్ కెప్టెన్), హర్వాన్ష్ సింగ్, ఆర్ ఎస్ అంబరిశ్, కనిష్క్ చౌహాన్, ప్రణవ్ రాఘవేంద్ర, మహ్మద్ ఎన్నాన్, ఆదిత్య రానా, అన్మోల్‌జిత్ సింగ్.
ఇంగ్లాండ్‌కు సూర్యవంశీ, అయుశ్
- Advertisement -
- Advertisement -