Tuesday, January 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసకుర సైన్స్‌ ప్రోగ్రాంకు ఎంపికైన నలుగురు విద్యార్థులు

సకుర సైన్స్‌ ప్రోగ్రాంకు ఎంపికైన నలుగురు విద్యార్థులు

- Advertisement -

పాఠశాల విద్యాశాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సకుర సైన్స్‌ ప్రోగ్రాం (జపాన్‌ సైన్స్‌ హైస్కూల్‌ ప్రోగ్రాం)కు తెలంగాణ నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను సీఎం రేవంత్‌ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్య సంచాలకులు డాక్టర్‌ ఇ.నవీన్‌ నికోలస్‌ అభినందించారు. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఇ.నవీన్‌ నికోలస్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రోగ్రాంను జపాన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఏజెన్సీ (జేఏస్టీ) నిర్వహిస్తున్నది. జపాన్‌ యువత, ఇతర దేశాల యువత మధ్య పరస్పరం అనుభవాలను పంచుకు నేందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు. ఈ ప్రోగ్రాంకు ఎంపికైన విద్యార్థులు ఈ ఏడాది మే 24 నుంచి 30వ తేదీ వరకు జపాన్‌ లో అత్యాధునిక శాస్త్రీయ సాంకేతికతను చూసే అవకాశాన్ని కల్పించారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ తెలంగాణ నుంచి నామినేషన్లను ఆహ్వానించింది. ముందుగా జిల్లా స్థాయిలో రాత పరీక్ష నిర్వహించి అక్కడ ఎంపికైన వారికి రాష్ట్ర స్థాయిలో పరీక్ష పెట్టి అంతిమంగా నలుగురిని ఎంపిక చేశారు. మన రాష్ట్రం నుంచి ఇంటర్‌ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు జి.శివాంజలీ (తెలంగాణ మోడల్‌ స్కూల్‌ అండ్‌ జూనియర్‌ కాలేజ్‌, సదాశివ్‌ నగర్‌, కరీంనగర్‌), సీహెచ్‌.అక్షయ (తెలంగాణ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజ్‌, హసన్‌ పర్తి, హన్మకొండ), బి.పరుశ (ఐఐఐటీ, మహబూబ్‌ నగర్‌, జోగులాంబ గద్వాల జిల్లా), ఇంటర్‌ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న బి.వేణు (తెలంగాణ మోడల్‌ స్కూల్‌, ఇర్కోడ్‌, సిద్ధిపేట) ఎంపికయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -