– కేంద్రం ప్రతిపాదన
– వ్యతిరేకిస్తున్న ఆపిల్, శామ్సంగ్
న్యూఢిల్లీ : ప్రభుత్వానికి సోర్స్ కోడ్ ఇచ్చేలా స్మార్ట్ఫోన్ ఉత్పత్తిదారులపై ఒత్తిడి తేవాలని భారత్ ప్రతిపాదించింది. భద్రతా చర్యలలో భాగంగా అనేక సాఫ్ట్వేర్ మార్పులు చేయాలని కూడా సూచించింది. అయితే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ప్రముఖ స్మార్ట్ఫోన్ ఉత్పత్తి సంస్థలైన ఆపిల్, శామ్సంగ్ వ్యతిరేకిస్తున్నాయి. భారత్ ప్రతిపాదిస్తున్న 83 భద్రతా ప్రమాణాలకు అంతర్జాతీయ నేపథ్యం ఏదీ లేదని, పైగా యాజమాన్య వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఏర్పడుతుందని పలు కంపెనీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచంలో రెండో అతి పెద్ద స్మార్ట్ఫోర్ మార్కెట్ అయిన భారత్లో సుమారు 75 కోట్ల ఫోన్లు ఉన్నాయి. అయితే ఆన్లైన్ మోసాలు, డేటా ఉల్లంఘనలు పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగ దారుల సమాచారాన్ని మరింత భద్రంగా ఉంచేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ప్రభుత్వం పలు చర్యలను ప్రతిపాదించింది. స్మార్ట్ఫోన్ పరిశ్రమ వ్యక్తంచేసే చట్టబద్ధమైన ఎలాంటి ఆందోళననైనా పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఐటీ శాఖ కార్యదర్శి కె.కృష్ణన్ తెలిపారు. కాగా ప్రభుత్వ ప్రతిపాదనలపై టెక్ కంపెనీలతో సంప్రదింపులు కొనసాగుతున్నందున వివరాలు వెల్లడించలేమని మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు.
సోర్స్ కోడ్ ఇవ్వాల్సిందే
- Advertisement -
- Advertisement -



