Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంచట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న గోరక్షకులు

చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న గోరక్షకులు

- Advertisement -

– చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు
– వారిని కఠినంగా శిక్షించాలి : సీపీఐ(ఎం) డిమాండ్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో
చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న గోరక్షకులను కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం రాత్రి బీబీనగర్‌ నుంచి హైదరాబాద్‌ నగరానికి వస్తున్న గేదెల బండి వాహనం డ్రైవర్‌పై లాలాగూడ ప్రాంతంలో గోరక్షకుల పేరుతో విశాల్‌, అతని బృందం దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి చేసిన వారిపై పోలీసులు కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.
నగరంలో గోరక్షకులు సూడో పోలీసుల్లా వ్యవహరిస్తూ.. అనేక ప్రాంతాల్లో రోడ్డుమీద తిష్ట వేసి వాహనాలలో గేదెలను తరలిస్తున్న వారిని నానారకాలుగా హింసిస్తున్నారని, వ్యాపారస్తులపై దాడి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. వీరికి ఈ అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. మనది ప్రజాస్వామ్య దేశమని, పోలీస్‌ వ్యవస్థ.. న్యాయవ్యవస్థ ఉన్నాయని, ఎవరైనా వ్యాపారులు చట్ట వ్యతిరేకంగా గేదెలు కానీ ఇతర జంతువులను తరలిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. చట్ట ప్రకారం శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ, గోరక్షకులు తమ సొంత ఎజెండాతో దాడులు చేస్తున్నారని తెలిపారు. దాడులు చేసే వారి పట్ల ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం, పోలీసుల ఉదాసీన వైఖరి వల్ల గోరక్షకులు ఆడిందే ఆట పాడిందే పాటగా చలామణి అవుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే నగరంలో ప్రశాంత వాతావరణ దెబ్బతిని ప్రజల మధ్య ఆనైక్యత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న గోరక్షకుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సీపీఐ(ఎం) తరపున డిమాండ్‌ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad