Friday, May 23, 2025
Homeజాతీయంప్రధాని మోడీ మౌనం వెనుక అర్థం ఏమిటి?

ప్రధాని మోడీ మౌనం వెనుక అర్థం ఏమిటి?

- Advertisement -

పవన్‌ ఖేరా
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ వ్యాఖ్యలను ప్రధాని మోడీ ఒక్కసారి కూడా తిరస్కరించలేదని , ఈ మౌనం వెనుక ఉద్దేశం ఏమిటని కాంగ్రెస్‌ గురువారం ప్రశ్నించింది. భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య వివాదాన్ని వాణిజ్యం ఒప్పందంతో పరిష్కరించానని ట్రంప్‌ పదేపదే ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపివేసినట్లు ప్రకటించడం ఇది ఎనిమిదోసారని కాంగ్రెస్‌ మీడియా మరియు ప్రచార విభాగం అధ్యక్షుడు పవన్‌ఖేరా అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ను భారత్‌ ముగించేలా వాణిజ్యాన్ని ఉపయోగించు కున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఈ వాదనను ఒక్కసారి కూడా తిరస్కరించలేదు. ఈ మౌనం అర్థం ఏమిటని ఎక్స్‌లో ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -