Friday, May 23, 2025
Homeరాష్ట్రీయంములకలపల్లి కుమారిపార్టీకి చేసిన సేవలు మరువలేనివి..

ములకలపల్లి కుమారిపార్టీకి చేసిన సేవలు మరువలేనివి..

- Advertisement -

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని
– కొక్కిరేణిలో అంత్యక్రియలు పూర్తి
నవతెలంగాణ-మునగాల

సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ములకలపల్లి రాములు సతీమణి కుమారి పార్టీకి చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. అనారోగ్యంతో ఉన్న కుమారి మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో మృతిచెందారు. బుధవారం స్వగ్రామమైన కొక్కిరేణిలో కుమారి మృతదేహాన్ని జాన్‌వెస్లీ, తమ్మినేని తదితరులు సందర్శించి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మునగాల ఎంపీపీగా, జెడ్పీటీసీగా పని చేసిన రాములుకు కుమారి నిరంతరం సహాయ సహకారాలు అందించారని గుర్తుచేశారు. పేద కుటుంబంలో పుట్టి పార్టీకి అంకితమై పనిచేశారని చెప్పారు. ప్రజాసేవలో ఉన్న రాములుకు ఆమె ఎంతో ఓర్పుగా అన్ని విధాలుగా సహకారం అందించారని తెలిపారు. పార్టీ, ప్రజాసంఘాల కార్యక్రమాల్లో కుమారి చురుకుగా పాల్గొనేవారన్నారు. కుమారి మృతి సీపీఐ(ఎం)కు, ప్రజాసంఘాలకు తీరని లోటన్నారు. ఆమె అకాల మృతి పట్ల సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున సంతాపం సానుభూతి తెలిపారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలో కుమారి చాలా ఉత్సాహంగా పాల్గొనేవారన్నారు.
అంతిమయాత్రలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మీ, బండారు రవికుమార్‌, ఎండి జహంగీర్‌, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు చెరుపల్లి సీతారాములు, డిజి.నర్సింహా రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు తప్పెట్ల స్కైలాబ్‌బాబు, ఆర్‌.వెంకట్రాములు, ప్రసాద్‌, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, డబ్బికార్‌ మల్లేశ్‌, వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్‌, నాయకులు పాలడుగు ప్రభావతి, పాలడుగు నాగార్జున, చినపాక లక్ష్మీనారాయణ, కల్లూరి మల్లేశం, నాగారపు పాండు, కోట గోపి, మట్టిపల్లి సైదులు, బుర్రి శ్రీరాములు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దేవరం వెంకట్‌రెడ్డి, చందా చంద్రయ్య, చెరుకు ఏకలక్ష్మి, బొప్పాని పద్మ, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -