– ప్రభుత్వ విప్, బిర్ల. ఎంపీ చామల
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న కొలనుపాక బ్రిడ్జి పనులను ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మరియు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.పనులు నాణ్యత ప్రమాణాలతో పాటు నిర్ణీత గడువులో పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.కొలనుపాక బ్రిడ్జి పూర్తయితే పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని, ముఖ్యంగా కొలనుపాక సోమేశ్వర ఆలయానికి వెళ్లే భక్తులకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని తెలిపారు.అలాగే రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగకరంగా మారుతుందని పేర్కొన్నారు.ప్రాంత సమగ్ర అభివృద్ధికి ఈ బ్రిడ్జి కీలకమని,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,సంబంధిత శాఖ అధికారులు,పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
కొలనుపాక బ్రిడ్జి నిర్మాణ పనుల పరిశీలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



