నవతెలంగాణ-గుండాల
పోడు రైతు నుంచి గురువారం రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఫారెస్టు బీట్ అధికారిని ఏసీబీ డిఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం నడిమిగూడెం ఫారెస్టు బీట్ అధికారి బానోతు నరేష్ ఏసీబీకి పట్టుబడ్డారు. తన తండ్రికి ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల పోడు భూముల్లో అటవీ అధికారులు జోక్యం చేసుకోవద్దని సాయనపల్లికి చెందిన రైతు కోరగా.. బీట్ అధికారి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రైతు నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా బీట్ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ప్రజలను ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ సూచించారు. లంచం అడిగితే 9154388981 ఫోన్ నెంబర్‌కు ప్రజలు ఫోన్ చేయాలని, మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు ఏసీబీకి ఫోన్ చేసేస్థాయిలో చైతన్యవంతం కావడం అభినందనీయమని అన్నారు.
ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



