– బలుగూరి రాంరెడ్డి మృతికి సీఐటీయూ సంతాపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధుకు పితృవియోగం కలిగింది. బలుగూరి రాంరెడ్డి(70) మృతి బాధాకరమని సీఐటీయూ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఆయన మృతికి సంతాపం ప్రకటించింది. ఆయన కుమారుడు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధుకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. గురువారం ఈ మేరకు సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న రాంరెడ్డి అనారోగ్యంతో మరణించారని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్వగ్రామమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారాంపురంలో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధుకి పితృవియోగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES