నవతెలంగాణ – కెపిహెచ్బి
ఎఐసిసి అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు ఆదివారం మూసాపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ హాజరయ్యారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు నాయకులకు పంచిపెట్టారు. వసుంధర ఆస్పటల్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ప్రియాంక గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్ వైభవాన్ని సంతరించుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సత్యం శ్రీరంగం, తూము వేణు, సేరిసతీష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, దినేష్ కుమార్, తూము వినయ్, కృష్ణ రాజ్ పుత్ ,కిట్టు, సలీం, రేష్మ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



