Tuesday, January 13, 2026
E-PAPER
Homeకరీంనగర్అప్పుల బాధతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

అప్పుల బాధతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జగిత్యాల జిల్లా కోరుట్లలో అప్పుల బాధ, భర్త వేధింపులు తాళలేక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రమ్య సుధ (36) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆమె, భర్త శ్రీధర్ వ్యాపారంలో నష్టాల కారణంగా పేరుకుపోయిన అప్పులకు ష్యూరిటీగా ఉండడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. సోమవారం భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ అనంతరం, ఇద్దరు కుమారులను బయటకు పంపించి రమ్య సుధ ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -