Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం 

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం 

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు విజయ్ కుమార్ 
నవతెలంగాణ – మిడ్జిల్ 

అట్టడుగు ఉన్న వర్గాల ప్రజలకు ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన పేదలందరికీ అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గడ్డల విజయ్ కుమార్, మాజీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని వాడియాల గ్రామంలో 200 యూనిట్ ఉచిత కరెంటు బాండ్ పేపర్లను లబ్ధిదారులకు సర్పంచ్ చంద్రయ్య గౌడ్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు.

రాజకీయాల  అతీతంగా ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి పథకం ప్రజలకు చేరే విధంగా అధికారులు, నాయకులు ముందు వరుసలో ఉండి పనిచేయాలని అన్నారు. ప్రజా ప్రభుత్వమంటేనే పేదల ప్రభుత్వమని పేదలందరూ కూడా ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఉప సర్పంచ్ నాగరాజు విద్యుత్ లైన్మెన్ వెంకటేష్, సాదిక్, వార్డు మెంబర్లు బిర్లా మల్లయ్య , కృష్ణయ్య, గజ్జల భీమయ్య, బసవరాజు, మంగలి రమేష్, బొర్రా శివ, జంగయ్య, పరశురాములు, రషీద్, బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -