క్రీడలలో ఉత్తమ ప్రతిభను కనబరిచేందుకు గట్టి పట్టుదల ఉండాలి ..
యువతకు క్రికెట్, వాలీబాల్ కిట్టును అందజేత ..
నవతెలంగాణ – మునుగోడు
క్రీడలలో ఆసక్తి ఉన్న యువత నైపుణ్యతను పెంపొందించాలనే తమ లక్ష్యమని బీరెల్లి గూడెం సర్పంచ్ దాసరి గోవర్ధన్ యాదవ్ అన్నారు. మంగళవారం గ్రామంలో యువతకి క్రికెట్, వాలీబాల్ కిట్లను తమ సొంత డబ్బులతో ఇప్పించారు. అనంతరం యువత సర్పంచ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని యువత ఉదయం , సాయంత్రం పాల్గొనడం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంతోపాటు దృఢమైన శక్తిని పొందుతారు అని అన్నారు. ఇంటర్నేషనల్ , నేషనల్ బహుమతులు పొందిన ఎంతోమంది క్రీడాకారులు గ్రామీణ ప్రాంతం నుంచి ఎక్కువగా వెళ్ళిన వారు ఉంటారని గుర్తు చేశారు. ఏ క్రీడారంగంలోనైనా రన్నించేందుకు వారిని ఆదర్శంగా తీసుకొని పోటీ పడ్డప్పుడే విజయం సాధిస్తామని యువతకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసరి గోవర్ధన్ యాదవ్ , ఉపసర్పంచి దోటి వెంకటేశ్వర్లు , వార్డు సభ్యులు దాసరి మహారాజు, వెంపల కవిత, దాసరి రమ్య, వెంపాల శంకర్, గ్రోమోర్ మేనేజర్ రాజేష్ గారు గ్రామ పెద్దలు దాసరి రాములు, దోటి శ్రీనివాస్, బొల్లం జంగయ్య, దాసరి సత్యనారాయణ, బిక్షం, లింగయ్య, వెంపల నరసింహ, దాసరి స్వామి తదితరులు ఉన్నారు.



