Tuesday, January 13, 2026
E-PAPER
Homeఆదిలాబాద్సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ..

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
కాంగ్రెస్ ప్రభుత్వం పేద మధ్య తరగతి ప్రజలకు అండగా ఉండేందుకు ఎంతో కృషి చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మండల యువనాయకుడు పురం శెట్టి రవికుమార్ అన్నారు. మంగళవారం కుభీర్ మండలంలోని పల్సి గ్రామానికి చెందిన గుర్జల రాములు అనే వ్యక్తి ఇటీవల అనరోగ్యం తో బాధపడుతుందాగా వారు ముఖ్య మంత్రి సహాయ నిది కి దరఖాస్తు చేసుకోవడంతో వారికి రూ.60వేల చెక్క్ ముఖ్య మంత్రి సహాయ నిది చెక్క్ ను పంపిణి చేయడం జరిగింది.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రజలకు మెరగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అదే విదంగా ముధోల్ నియోజక వర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్ ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ది కి ప్రత్యేక శ్రద్ధ చూపి గ్రామాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమం లో గ్రామ ఉప సర్పంచ్ యువ నాయకులు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -