నవతెలంగాణ-కమ్మర్ పల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం వేల్పూర్ మండల కేంద్రంలోని తన స్వగృహంలో కమ్మర్ పల్లి, భీంగల్, ఎర్గట్ల, మోర్తాడ్, వేల్పూర్ మండలాలలకు చెందిన పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఇటీవల బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన చెక్ ల పంపిణి కార్యక్రమానికి వివిధ కారణాలతో హాజరు కాలేక మిగిలిపోయిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్ లను లబ్దిదారులకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి చెక్ లు అందుకున్న వారందరికీ, ఇప్పుడు చెక్ లు తీసుకోబోతున్న వారికీ వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం ఇవ్వాలని రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
హామీ ప్రకారం తులం బంగారం ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



