నవతెలంగాణ – మునుగోడు
ప్రతి పార్లమెంటు నియోజకవర్గం లో ప్రధానమంత్రి సంసద్ క్రీడా మహోత్సవం ను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి అని బిజెపి అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్ , మండల అధ్యక్షులు పెంబళ్ల జానయ్య కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కబడ్డీ వాలీబాల్ క్రికెట్ క్రీడాకారుల నుంచి టీముల పేర్లు ను నమోదు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు భవనం మధుసూదన్ రెడ్డి,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కర్నాటి లింగయ్య, జిల్లా నాయకులు బొలుగురి రమేష్, మండల ప్రధాన కార్యదర్శులు అక్కెనపల్లి సతీష్, పందుల యాదయ్య, సీనియర్ నాయకులు కర్నాటి యాదయ్య, మండల కార్యదర్శి దాం విష్ణు, జీడిమెట్ల జానీ, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి ఒడిగ స్వామి, యువ నాయకులు బీసం కృష్ణ యాదవ్, పెరుమాళ్ళ శ్రీరామ్, వార్డు మెంబర్లు వనం విజయ్, బుడిగపాక రవి, నందిపాటి శంకర్, బొజ్జ రాములు తదితరులు పాల్గొన్నారు.



