Friday, May 23, 2025
Homeజాతీయంవక్ఫ్‌పై మధ్యంతర ఉత్తర్వుల పట్ల తీర్పు రిజర్వ్‌

వక్ఫ్‌పై మధ్యంతర ఉత్తర్వుల పట్ల తీర్పు రిజర్వ్‌

- Advertisement -

ఆ ఆస్తుల స్వాధీనానికి ఓ మార్గం
పిటిషనర్ల తరపు న్యాయవాదులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

వక్ఫ్‌ (సవరణ) చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కూడా విచారించింది. పిటిషన్లతో పాటు కేంద్రం వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం మూడు కీలక అంశాల పట్ల మధ్యంతర ఉత్తర్వులపై తీర్పు రిజర్వ్‌ చేసింది. వక్ఫ్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న పిటిషనర్ల తరపున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, రాజీవ్‌ ధావన్‌, అభిషేక్‌ మను సింఘ్వీల వాదనలను సీజేఐ బీఆర్‌ గవారు, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మాసితో కూడిన ధర్మాసనం దాదాపు మూడు రోజుల పాటు వాదనలు విని తీర్పును రిజర్వ్‌ చేసింది. కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. వక్ఫ్‌చట్టం లౌకికవాదంతో ముడిపడి ఉందని.. పార్లమెంట్‌ ఆమోదించిన ఏదైనా చట్టం రాజ్యాంగబద్ధంగా భావించబడుతున్నందున.. దాన్ని నిలిపివేయ లేమంటూ కేంద్రం స్పష్టం చేసింది. పిటిషనర్ల తరపున హాజరైన కపిల్‌సిబల్‌ వాదనలు వినిపిస్తూ రాజ్యాంగ సూత్రాలను విస్మరించారన్నారు. చట్టం న్యాయ వ్యవస్థేతర ప్రక్రియ ద్వారా వక్ఫ్‌ ఆస్తులను స్వాధీనం చేసుకునేం దుకు ఓ మార్గమన్నారు. పిటిషనర్లు మూడు కీలక అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వక్ఫ్‌ బై కోర్ట్స్‌, వక్ఫ్‌ బై యూజర్‌, వక్ఫ్‌ బై డీడ్‌గా ప్రకటించిన ఆస్తులను డీనోటిఫై చేసే అధికారం ఈ మూడు అంశాలలో ఒకటి. రాష్ట్ర వక్ఫ్‌ బోర్డులు, కేంద్ర వక్ఫ్‌ కౌన్సిల్‌ కూర్పునకు సంబంధించినది రెండో అంశం. ఎక్స్‌ అఫిషియో సభ్యులు తప్ప మిగిలిన సభ్యులందరూ ముస్లింలే ఉండాలన్నది పిటిషనర్ల వాదన. ఇక మూడవది.. వక్ఫ్‌ ఆస్తా లేక ప్రభుత్వ ఆస్తా అన్న విషయాన్ని నిర్ధారించడానికి కలెక్టర్‌ విచారణ చేపట్టిన తరువాత ఆ ఆస్తిని వక్ఫ్‌ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధనను పిటిషనర్లు వ్యతిరేకిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -