- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యూర్ గ్రామానికి చెందిన ఎడ్ల వర్షిణికి గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ గా ఎంపికైయింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ఎంపికై మంచిర్యాల మెడికల్ కాలేజీలో విధులు నిర్వర్తించేందుకు మంగళవారం నియామక పత్రాన్ని వైద్య కళాశాల ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిశ్రీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా వర్షిణి మాట్లాడుతూ.. ప్రభుత్వ కొలువులో ప్రజలకు సేవ చేయాలి అనుకునే తన లక్ష్యం నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది. ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాందించడానికి ప్రోత్సహించిన తన భర్త రామ్, కుటుంబానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



