- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారంటీల్లో భాగంగా గృహజ్యోతి పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు జీరో విద్యుత్ బిల్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలో మంగళవారం విద్యుత్ మండల ఇంఛార్జి ఏఈ శేఖర్, లైన్ మెన్ రవి, జెఎల్ఎం మహేందర్, ఆన్ మ్యాన్ ఇందారపు రాజేష్ అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 52,82,489 కుటుంబాలకు జీరో విద్యుత్ బిల్లుల ద్వారా ప్రభుత్వం రూ.3.593 కోట్లు చెల్లిస్తోంది. తాడిచెర్లలో 1500 మంది లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేస్తున్నట్లుగా ఏఈ తెలిపారు.
- Advertisement -



