Tuesday, January 13, 2026
E-PAPER
Homeఖమ్మంప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధులపై అవగాహన

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధులపై అవగాహన

- Advertisement -

ఈనెల 20న మధిరలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఉచిత క్యాంప్
శ్రీ రక్ష హాస్పిటల్ ప్రముఖ వైద్యులు గోంగూర వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – బోనకల్ 

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శ్రీ కృష్ణం రాజు మెమోరియల్ యునైటెడ్ కింగ్డమ్ ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రముఖ వైద్యులు గోంగూర వెంకటేశ్వర్లు ఏడుకొండలు డయాబెటిస్ వ్యాధి పై అవగాహన, వ్యాధి వల్ల వచ్చే ఇబ్బందులు పై మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర హెల్త్ సూపర్వైజర్లకు ఏఎన్ఎం లకు ఎంఎల్ హెచ్ పి, ఆశ కార్యకర్తల కు  అవగాహన కల్పించారు. 20 జనవరి న తేదీన మధిర రెడ్డి ఫంక్షన్ హాల్ నందు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు జరగబోయే క్యాంప్ గురించి వివరించారు.

డయాబెటిస్ లక్షణాలు ఉన్నవారు, డయాబెటిస్  వ్యాధిగ్రస్తులు, డయాబెటిస్ వల్ల పుండ్లు, ఏ ఇతర వ్యాధుల వల్ల వచ్చిన మానని పుండ్లు ఉన్నవారిని ఈ క్యాంప్ కు వచ్చేలా చూడాలని కోరారు.క్యాంప్ కు వచ్చే వారికి ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు, డయాబెటిక్ ఫుట్ కేర్ పై అవగాహన , అవసరమైన వారికి డాప్లర్ టెస్ట్, (పుండు పై మానని చర్మాన్ని తీసివేయిట), ఆపరేషన్ అవసరమైన వారికి మరుసటి రోజు చేసి మందులు ఉచితంగా పంపిణీ చేస్తారని తెలిపారు. బోనకల్లు మండలంలో ఉన్న డయాబెటిస్ వ్యాధిగ్రస్తులను క్యాంప్ జరుగు స్థలమునకు తీసుకు వెళ్ళటానికి బస్ సౌకర్యం, బోజన సదుపాయం కూడా ఉంటుందని తెలిపారు.

డయాబెటిస్ ఉన్న ప్రతి ఒక్కరిని పూర్తిస్థాయిలో ఈ క్యాంపుకు తీసుకువచ్చే విధంగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది కృషి చేసి క్యాంపు విజయవంతం అయ్యేవిధంగా సహకరించాలని వారు కోరారు. ఈ అవగాహన సదస్సులో మండల ప్రాథమిక వైద్యాధికారిని వేముల స్రవంతి డిఎం అండ్ హెచ్ ఓ హెల్త్ సూపర్వైజర్ వేణుగోపాల్ హెల్త్ సూపర్వైజర్లు టీ స్వర్ణమార్తా ఎల్ శోభారాణి, ఎం ఎల్ హెచ్ పి లు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -