నవతెలంగాణ – బోనకల్
మండల పరిధిలోని రావినూతల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భముగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, దుగ్గి హనుమంతరావు అండ్ అదర్స్, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో మహిళలు, చిన్నారులు పాల్గొని సంక్రాంతి ముగ్గులు, గంగిరెద్దులు, చెరుకు గడలు, గాలిపటాలతో, గ్రోమోర్ కంపెనీ లోగోలతో అంగరంగ వైభవంగా మహిళలు ముగ్గులు రంగవల్లులు వేశారు. ఈ పోటీలలో 151 మంది మహిళలు పాల్గొన్నారు. మొదటి బహుమతిని యర్రగాని కృష్ణవేణి, ద్వితీయ బహుమతిని బానోతు స్వప్న, తృతీయ బహుమతిని బంధం మంగమ్మ గెలుచుకున్నారు.
ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమములో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జోనల్ ఆఫీసర్ అనుగు సుమన్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ పుప్పాల ఫణి రామ్ కుమార్, సర్పంచ్ భూక్య భద్రం నాయక్, ఉప సర్పంచ్ దొండపాటి సత్యనారాయణ, ప్రముఖ పురుగుమందుల వ్యాపారి చన్నా సుధీర్ కుమార్, జూనియర్ ఆగ్రోమిస్ట్ పొడిసెట్టి నిఖిలేశ్వర్, దూదిమెట్ల మధుసూదన్ రావు, గుత్త నాగేశ్వరరావు, తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ సభ్యులు జోనిబోయిన గురవయ్య, విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే మహిళలకు అతి పెద్ద పండుగ అన్నారు.
గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం తమకు ఎంతో సంతోషకరంగా ఉందని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రతినిధులు అన్నారు. ముగ్గుల పోటీలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రావినూతల గ్రామాన్ని గ్రోమోర్ కోరమాండల్ దత్తత గ్రామముగా తీసుకోవడం ఆ వెంటనే సంక్రాంతి పండుగ రావటం మహిళలకు అత్యంత ప్రీతి పాత్ర పండుగ అయిన సంక్రాంతి పండుగకు మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించడ తమకు చాలా గర్వంగా ఉందన్నారు. ముగ్గుల పోటీలలో భారీగా మహిళలు పాల్గొంటారని తాము ఊహించలేదని జోనల్ మేనేజర్ సుమన్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులోనూ ఇదేవిధంగా తమకు సహకరించాలని, తాము నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమాలకు సహకరిస్తున్న రావినూతల గ్రామ ప్రజలందరికీ కోరమాండల్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ అధ్యక్షులు మైనేని నారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వట్టికొండ రామకృష్ణ, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, మాజీ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, సిపిఎం నాయకులు గుగులోతు నరేష్, ఎర్రగాని నాగరాజు, వార్డ్ మెంబర్స్ పటాన్ అఫ్జల్, వట్టికొండ రజని, టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, షేక్ నన్నేసా, బోయినపల్లి గోపాల్,గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



