- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
జనగామ గ్రామంలో 4వ వార్డులో బోర్ లోని మోటర్ చెడిపోవడంతో ఆ కాలనీవాసులకు నీటి కొడత ఏర్పడింది. ఈ విషయాన్ని గ్రామస్తులు అ వార్డు మెంబర్ వడ్ల నర్సింహా చారి కి చెప్పడంతో వెంటనే ఆయన ఆ సింగిల్ ఫేస్ మోటార్ రిపేర్ చేపట్టారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మోటార్ మరమ్మత్తులు చేయించారు. దీంతో నీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించింది. గ్రామస్తులు వార్డు మెంబర్ సేవలను అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.
- Advertisement -



