- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని 39వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మహమ్మద్ ఆబిద్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం ఇంటింటికి ముగ్గుల కలర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ అందరికీ శుభాలను చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మనోహర్, లత, సాజిత్, నిరంజన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



