Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఆదర్శ విద్యార్థుల ఎంపిక

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఆదర్శ విద్యార్థుల ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి మండల కేంద్రంలోని ఆదర్శ హై స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 60 మీటర్ల రన్నింగ్ లో అండర్ 8 ఇయర్స్ విభాగంలో హర్షిత్ విజేతగా నిలువగా, అండర్ 10 ఇయర్స్ విభాగంలో రిషి ద్వితీయ స్థానంలో, అండర్ 12 ఇయర్స్ విభాగంలో రఘు ద్వితీయ స్థానం, అండర్ 14 ఇయర్స్ విభాగంలో అభి కుమార్ విజేతగా నిలిచారు.

విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు , మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ పూతల సమ్మయ్యలు బహుమతులు అందజేశారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను, కోచ్ కార్తీక్, వెంకటేష్ లను ఆదర్శ విద్యా సంస్థల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరస్పాండెంట్ జనగామ కార్తీక్ రావు, ప్రిన్సిపాల్ కృషిత లు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -