Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మూడు రోజులు జరుపుకునే ఏకైక పండగ సంక్రాంతి: సీఐ

మూడు రోజులు జరుపుకునే ఏకైక పండగ సంక్రాంతి: సీఐ

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు 
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి అని ఆలేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ యాలాద్రి అన్నారు. ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్ కుమార్  ఆధ్వర్యంలో మంగళవారం నాడు మహిళలతో జరిగిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 

భోగి, మకర సంక్రాంతి, కనుమ పండగలు వరుసగా జనవరి నెలలో మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకోవడం పండగ సందర్భంగా భోగి మంటలు గొబ్బెమ్మలు హరిదాసు కీర్తనలు పశువులను పూజించడం, జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు. ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేసి మహిళలు గ్రామంలో పండగ వాతావరణం ఉట్టిపడే విధంగా గ్రామంలో పది రోజుల ముందుగానే రోజు ముగ్గులు వేస్తూ వీధులు అందంగా తయారవుతాయి అన్నారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలు ఒకరి కంటే ఒకరు అందంగా వేయాలని చేసిన కృషిని అభినందించారు.

అన్ని గ్రామాల్లో మూడు రోజులు పండగ జరుగుతుంటే టంగుటూరులో నేటి నుండి నాలుగు రోజులు పండగ వాతావరణం అంగరంగ వైభవంగా నెలకొంది అన్నారు. గంగిరెద్దులు డోలు వాయిద్యాలు కోలాటాలు డాన్సులతో గ్రామం మొత్తం ఒక్క దగ్గరికి చేరి పోటీలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసిన గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ ని అభినందించారు. పోటీల్లో పాల్గొన్న 120 మంది మహిళలకు ప్రతి ఒక్కరికి సీఐ చేతుల మీదుగా బహుమతి ప్రధానం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎలగందుల వెంకటేష్ ఉప సర్పంచ్ భూపల్లి అక్షయ, జనం టివి శంకర్ మాజీ సర్పంచ్ గంగుల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు బండి శ్రీనుజూకంటి బాబు, నీల రామన్న వార్డు మెంబర్లు గ్రామస్తులు పెద్దలు సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -