నవతెలంగాణ – మిడ్జిల్
క్రీడాకారులు ఎప్పుడైనా గెలుపు, ఓటమి సమానంగా తీసుకోవాలని ఓడిపోతే కృంగిపోవద్దు, గెలుపొందితే పొంగిపోవద్దని నేడు ఓటమి రేపు గెలుపుకు నాంది పలుకుతుందని క్రీడాకారులు గ్రహించాలని సర్పంచ్ రాజు నాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని పెద్ద గుండ్ల తండాలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను ఉప సర్పంచ్ శ్రీనివాస్ నాయక్ తో కలిసి విజేతలకు రూ.3000/-, బహుమతులు మాజీ వార్డు మెంబర్ మెగావాత్ శంకర్ నాయక్, టోపీ బహుమతులు ఆంగోత్ స్వప్న హనుమంతులు అందజేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంగోత్ వశ్య నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమార్ నాయక్, మెగా శ్రీను నాయక్, మేఘావత్ రమేష్ నాయక్, వడితే ఆవత్ శంకర్ నాయక్, మెగావాత్ శంకర్ నాయక్, తండా ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
గెలుపు ఓటమి సమానంగా తీసుకోవాలి: సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


