నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలో ఎల్ఐసి బీమా సంస్థ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ కృష్ణ మోహన్ మాట్లాడుతూ.. ఎల్ఐసి పాలసీ క్రైమ్ సెటిల్మెంట్ లో 99% సెటిల్మెంట్ చేయడం జరుగుతుందని, కామారెడ్డి ఎల్ఐసి భీమా సంస్థ బ్రాంచ్ పాలసీలు పెంచడంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఎల్ఐసి పాలసీ గురించి ప్రజలకు అవగాహన కల్పించి పాలసీ తీసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్ ను ఎల్ఐసి చీఫ్ అడ్వైజర్ రాజిరెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏ ఏ ఓ అనర్దన్, రమేష్, నాగేశ్వర్ రావు, రాములు, ప్రవీణ్, చంద్రం, డెవలప్మెంట్ అధికారులు, ఎజెంట్లు కుంటయ్య, కర్నకర్ రెడ్డి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
ఎల్ఐసి బీమా సంస్థ సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



