హీరో శర్వా, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబోలో రూపొందిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథనాయికలుగా నటించారు. నేడు (బుధవారం) ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ, ‘నిర్మాతగా ఇది 16వ సంవత్సరం. జనవరి 14, 2010 ‘నమో వెంకటేశా’ విడుదలైంది. యాదచ్ఛికంగా జనవరి 14న ‘నారీనారీ నడుమ మురారి’ రిలీజ్ అవుతుంది. ‘సామజవరగమన’ ఒక మిరాకిల్. కోవిడ్ సమయంలో అసలు సినిమాలు జరుగుతాయా లేదా ఆనుకున్న సమయంలో శ్రీవిష్ణు ఒక్క కాల్‌తో సినిమా చేశారు. ఈ సినిమాలో కూడా ఆయనకు ఒక మంచి క్యామియో రోల్ ఉంది. ఆయన ఉన్నంత సేపు మీరు నవ్వుతూనే ఉంటారు. డైరెక్టర్ రామ్ అద్భుతంగా తీర్చిదిద్దారు. కామెడీ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, డ్రామా అన్ని అద్భుతంగా ఉంటాయి. సాక్షి, సంయుక్త ఇద్దరు కూడా చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. కంటెంట్ బాగుంటే గ్యారెంటీగా ఆడేస్తుందనే సీజన్ సంక్రాంతి. అది నా ఫస్ట్ సినిమా నుంచి తెలిసింది. మీరు ఈ సినిమా కోసం థియేటర్‌కి రావడమే ఆలస్యం నవ్వులు మొదలైపోతాయి. ఇప్పటివరకు ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా నవ్వుతూ హ్యాపీగా బయటికి వచ్చారు. ఇది శర్వాకి మూడో సంక్రాంతి సినిమా అవుతుంది. ‘శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా’ ఇప్పుడు ఈ చిత్రం. ఈ సినిమా టికెట్లు ఎంఆర్‌పీ ధరలకే ఉంటాయి. అందరూ నేడు (బుధవారం) ఈవినింగ్ 5 గంటల 49 నిమిషాలకి థియేటర్స్‌కి రండి. మీ అందరిని ఈ సినిమా గొప్పగా అలరిస్తుంది’ అని తెలిపారు.
‘మా రైటర్స్ భాను, నందు ‘సామజ..’కి పని చేశారు. అది ఎలా ఎంటర్టైన్ చేసిందో ఈ సినిమా కూడా మిమ్మల్ని అలానే అలరిస్తుంది. క్లీన్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్. పండక్కి ఫ్యామిలీ అందరూ హ్యాపీగా వెళ్లి చూసే సినిమా ఇది. నన్ను బిలీవ్ చేసిన అనిల్‌కి థ్యాంక్యూ. శర్వాతో వర్క్ చేయడం చాలా హిలేరియస్‌గా ఉండింది. ఇది చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అసలైన పండుగ ఆఫర్ ఎమ్మార్పీ ధరలకే ఈ టికెట్లు ఉంటాయి’ అని డైరెక్టర్ రామ్ అబ్బరాజు చెప్పారు.
హీరోయిన్ సాక్షి వైద్య మాట్లాడుతూ,’ఇది నా ఫస్ట్ సంక్రాంతి రిలీజ్. నాకు ఇంత అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ సాయికి థ్యాంక్యూ. ఈ క్యారెక్టర్ నాకు ఎప్పుడూ గుర్తుండిపోతుంది. చాలా ఎంజారు చేశాను. శర్వాతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అనిల్‌తో ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడే మరో సినిమా కలిసి చేస్తామని చెప్పారు. చెప్పినట్లే ఈ సినిమా ఇచ్చారు. క్లీన్ ఫ్యామిలీ ఫిలిం ఇది. అందరూ ఎంజారు చేస్తారు’ అని తెలిపారు.
మరో హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ,’ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మొత్తం బజ్ మారిపోయింది. ఆడియన్స్‌కి చాలా బాగా కనెక్ట్ అయ్యింది. చాలా మంచి ఎంటర్టైనర్ ఇది’ అని అన్నారు.
ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



