ఐసీసీకి బంగ్లాబోర్డు స్పష్టీకరణ
ఢాకా : ఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌లో అడుగు పెట్టబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మరోసారి స్పష్టం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుండగా.. బంగ్లాదేశ్ మ్యాచ్‌లు గ్రూప్ దశలో కోల్‌కతా,ముంబయిలో షెడ్యూల్ చేశారు. భారత్‌లో ఆధ్యాత్మిక, రాజకీయ వేత్తల విమర్శల నేపథ్యంలో బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ జట్టు నుంచి విడుదల చేయటంతో మొదలైన వివాదం… రోజురోజుకు మరింత ముదురుతోంది. భారత్‌లో బంగ్లాదేశ్ జట్టు, అభిమానులకు ఎటువంటి భద్రతా పరమైన సమస్యలు లేవని ఐసీసీ సెక్యూరిటీ నివేదికలో పేర్కొన్నప్పటికీ.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బెట్టు వీడటం లేదు. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కావటం సహా లాజిస్టికల్ ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి. ఈ సమయంలో షెడ్యూల్ మార్పులు సాధ్యం కాదని, ససేమిరా అంటే బంగ్లాదేశ్ ఆర్థిక పరంగానూ నష్టపోయే ప్రమాదం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్ క్రికెటర్‌ను అర్థాంతరంగా ఐపీఎల్ నుంచి తప్పించటం ఆ దేశ యువతను తీవ్ర ఆగ్రహానికి గురి చేయగా.. త్వరలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సమయంలో యువత అభిష్టానికి అనుగుణంగానే నడుచుకోవాలనే ఆలోచన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో కనిపిస్తోంది.
భారత్‌లో అడుగుపెట్టం!
- Advertisement -
- Advertisement -



