యాంగాన్ : మయన్మార్‌లో సైనిక పాలన ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో మిలటరీ అనుకూల పార్టీ మంగళవారం దిగువ సభలో మెజారిటీ సీట్లను గెలుచుకుంది. కాగా ఈ ఎన్నికల ఫలితాలు దేశంపై సాయుధ బలగాలు తమ పట్టును మరింత కాలం కొనసాగించడానికి ఉపయోగప డుతుందని ప్రజాస్వామ్య పర్యవేక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు. మయన్మార్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దాదాపుగా సైన్యమే దేశాన్ని బలవంతంగా పాలిస్తూ వచ్చింది. ఒక పదేళ్ళపాటు అమలైన ప్రజాస్వామ్య ప్రయోగం పౌర రాజకీయ నేతలకు కేవలం తాత్కాలికమైన నియంత్రణనే ఇచ్చింది. ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని పడదోసి 2021లో అధికారంలోకి వచ్చిన సైనిక జనరల్స్ దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెట్టారు. మూడవ, తుది దశ పోలింగ్ జనవరి 25తో ముగిసిన తర్వాత ప్రజలకు అధికారాన్ని అప్పగిస్తామని జుంటా హామీలిచ్చింది. దశలవారీగా జరుగుతున్న ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. ఆదివారం జరిగిన రెండవ దశ పోలింగ్‌లో వంద సీట్లకు గానూ 87సీట్లను తాము గెలుచుకున్నామని పేరు వెల్లడించని యుఎస్‌డిపి (యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ) అధికారి ఒకరు తెలిపారు. మొదటి దశలో వచ్చిన సీట్లతో కలుపుకుంటే ఇప్పటివరకు దిగువ సభలో పార్టీకి 176సీట్లు వచ్చాయి. అంటే మూడవ దశ పోలింగ్ జరగకముందే 330 సీట్లలో సగానికి పైగా వచ్చాయి. మిలటరీనే రూపొందించిన రాజ్యాంగం ప్రకారం దిగువ సభలోని 440సీట్లలో 110 సీట్లు సాయుధ బలగాలకు కేటాయించబడ్డాయి.
మయన్మార్‌లో మిలటరీ అనుకూల పార్టీకి మెజారిటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



