‘జన నాయగన్’ విడుదల అడ్డుకోవడంపై రాహుల్‌గాంధీ విమర్శలు
న్యూఢిల్లీ : ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజరు నటించిన తమిళ చిత్రం జన నాయగన్ విడుదలను అడ్డుకోవడానికి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ నాయకులు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఈ ప్రయత్నాన్ని తమిళ సంస్కృతిపై దాడిగా రాహుల్‌గాంధీ విమర్శించారు. ‘మోడీ, మీరు తమిళ ప్రజల గొంతును అణచివేయడంలో ఎప్పటికీ విజయం సాధించలేరు’ అని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. జన నాయగన్ విడుదలకు రాహుల్‌గాంధీ మద్దతు ప్రకటించారు.
రేపు ‘జన నాయగన్’ పిటిషన్ విచారణ
జన నాయగన్ చిత్రానికి సీబీఎఫ్‌సీ సర్టిఫికేట్ మంజారు చేయడంపై మద్రాస్ హైకోర్టు స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ నెల 15న సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ చిత్రానికి సీబీఎఫ్‌సీ క్లియరెన్స్ మంజారు చేయాలన్న సింగిల్ జడ్జి తీర్పును నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను ముందుగా ఈ నెల 19కు విచారణ కోసం జాబితా చేసినా, ఈ విచారణ తేదీని మంగళవారం సాయంత్రం సవరించారు. సుప్రీంకోర్టు కాజ్ లిస్ట్ ప్రకారం ఈ పిటిషన్‌ను సీజేఐ సూర్యకాంత్ ధర్మాసనం ఈ నెల 15న విచారించినుంది.
తమిళ సంస్కృతిపై దాడి
- Advertisement -
- Advertisement -



