శాన్‌ఫ్రాన్సిస్కో : ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా గ్రూపు తన రియాలిటీ ల్యాబ్స్ డివిజన్‌లోని 10 శాతం మంది ఉద్యోగులపై వేటు వేయనుందని సమాచారం. ఈ కంపెనీలో దాదాపు 15,000 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఇందులో 1500 మంది వరకు సిబ్బందిని అర్ధంతరంగా ఇంటికి పంపిస్తోంది. వస్తొన్నాయి. రియాలిటీ ల్యాబ్స్ వర్చువల్ అగ్యుమెంటెడ్ రియాలిటీ ఉత్పత్తుల తయారీని కలిగి ఉంది. ఇప్పటికే ఈ సంస్థ ఆక్యులస్, విఆర్ హెడ్ సెట్ వంటి ఉత్పత్తుల్ని అందించింది. ప్రస్తుతం పలు రకాల హెడ్ సెట్స్, రే బాన్ స్మార్ట్ గ్లాసెస్, హారిజాన్ వరల్డ్స్ ప్లాట్ ఫాం వంటి ఉత్పత్తుల్ని అందిస్తోంది. ఈ ఉద్వాసన విషయమైన ఉద్యోగులకు సమాచారం ఇవ్వడానికి వారిని ఆ సంస్థ సీటీఓ ఆండ్య్రూ బోస్వర్త్ బుధవారం మీటింగుకు పిలిచారు. ఇది ఈ ఏడాదిలోనే ముఖ్యమైన మీటింగ్ అని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా, వ్యక్తిగతంగా హాజరుకావాలని కోరారు. ఈ మీటింగ్ తర్వాత ఉద్యోగుల తొలగింపుపై స్పష్టత రానుంది.



