వెబ్‌సైట్, థీమ్, లోగో ఆవిష్కరణ
న్యూఢిల్లీ : బ్రిక్స్ 2026 అధ్యక్ష పదవిని భారత్ మంగళవారం స్వీకరించింది. ఈ సందర్భంగా బ్రిక్స్ అధికారిక వెబ్‌సైట్, థీమ్, లోగోను కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రారంభించారు. బ్రిక్స్‌కు నాయకత్వం వహిస్తున్న భారత్ ‘మానవత్వమే ముందు’, ‘ప్రజా కేంద్రీకృత విధానం’ను అవలంభిస్తుందని జైశంకర్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే, బ్రిక్స్‌కు నాయకత్వం వహిస్తున్న దేశంగా భారత్ ఈ గ్రూపులోని సభ్య దేశాల సామర్థ్యాన్ని మరింతగా ప్రపంచ సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుందని జైశంకర్ తెలిపారు. ఈ ఏడాదికి బ్రిక్స్ ప్రారంభమై 20 ఏండ్లు పూర్తవుతాయని మంత్రి తెలిపారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారానికి ఈ గ్రూపు ఒక ముఖ్యమైన వేదికగా అభివృద్ధి చెందిందని చెప్పారు. కాగా, బ్రిక్స్‌కు అధ్యక్షత వహించడం భారత్‌కు ఇది నాల్గోవసారి. చివరిసారిగా 2021లో అధ్యక్ష పదవిని చేపట్టింది. కాగా, బ్రిక్స్ 2026 లోగోగా కమలం పువ్వును ఎంపిక చేశారు. అయితే ఇందులో మధ్య భాగాన్ని ‘నమస్తే’ భంగంలో రూపొందించారు. కాగా, కేంద్రంలోని అధికార బీజేపీ ఎన్నికల గుర్తు కూడా కమలం కావడం గమనార్హం.
బ్రిక్స్ అధ్యక్ష పదవీ స్వీకరించిన భారత్
- Advertisement -
- Advertisement -



