- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పండుగ వేళా విషాదం నెలకొంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న బస్సు జడ్చర్ల మాచారం వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున ముందు వెళ్తున్న డీసీఎంను బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులోని 31 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -



